हिन्दी | Epaper

China: పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత

Saritha
China: పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత
China: Extracting gold from old SIM cards

China: పడేసే పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ. 27 లక్షల విలువైన బంగారం (Gold) తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన కియావో అనే వ్యక్తి ఈ అరుదైన ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇందుకోసం అతడు చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలితం దక్కింది..

Read Also: PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి

ఇది ప్రమాదకరమని, ఎవరూ ప్రయత్నించవద్దని హెచ్చరిక

ప్రొఫెషనల్ స్క్రాప్ మెటల్ రీఫైనర్ అయిన కియావో, దాదాపు రెండు టన్నుల పాత టెలికాం చిప్‌లు, సిమ్ కార్డులు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాడు. వీటి నుంచి క్లిష్టమైన రసాయన ప్రక్రియ ద్వారా సుమారు 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీశాడు. దీని విలువ దాదాపు 2 లక్షల యువాన్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 26 నుంచి 27 లక్షల వరకు ఉంటుందని అంచనా. జనవరి 20న తాను ఈ ప్రక్రియ చేస్తున్న వీడియోను పంచుకోగా, అది 5 మిలియన్లకు పైగా వీక్షణలు పొందింది.

ఈ-వేస్ట్‌ను రసాయనాల్లో ముంచి, వేడి చేసి, ఫిల్టర్ చేయడం ద్వారా బంగారాన్ని వేరు చేసినట్టు కియావో చూపించాడు. అయితే, ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అని, ఇందులో వాడే రసాయనాల వల్ల ప్రాణాంతక వాయువులు వెలువడతాయని హెచ్చరించాడు. చైనాలో ఇలా బంగారం శుద్ధి చేయడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అనుమతి లేనిదే దీన్ని చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష పడతాయి. అయితే, తనకు అధికారికంగా లైసెన్స్ ఉందని కియావో పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870