అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చైనా ఉత్పత్తులపై 50 నుండి 100 శాతం వరకు భారీ టారిఫ్ (Tariff) లు విధించాలని చేసిన వ్యాఖ్యలు మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించాయి. ఈ ప్రతిపాదనపై చైనా (China) తీవ్రంగా స్పందించింది. ఆంక్షలు, యుద్ధాలు, టారిఫ్‌లు వంటి చర్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావని, దాంతో పరిస్థితి మరింత క్లిష్టతరమవుతుందని చైనా స్పష్టం చేసింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Chinese Foreign Minister Wang Yi) ఈ వివాదంపై స్పష్టమైన స్పందన ఇచ్చారు. ఆయన శనివారం స్లోవేనియాలో పర్యటిస్తున్న సమయంలో ఆ దేశ ఉప ప్రధాని తాన్యా ఫజోన్‌తో సమావేశం అనంతరం మీడియా (Media) తో మాట్లాడారు. “చైనా ఎప్పుడూ యుద్ధాలను ప్రోత్సహించదు, వాటిలో పాల్గొనదు. మేము విశ్వసించే మార్గం శాంతియుత చర్చలు, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించడం మాత్రమే” అని ఆయన అన్నారు.

రష్యాపై చైనాకు బలమైన పట్టు ఉంది
ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం గందరగోళం, ఘర్షణలతో నిండి ఉందని, ఈ సమయంలో బహుళపాక్షిక విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా, యూరప్ (China, Europe) లు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.అంతకుముందు, డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే వరకు నాటో కూటమి చైనాపై 50 నుంచి 100 శాతం టారిఫ్‌లు విధించాలి.
రష్యాపై చైనాకు బలమైన పట్టు ఉంది. ఈ భారీ సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయి. తద్వారా ఈ భయంకరమైన యుద్ధానికి ముగింపు పలకవచ్చు” అని ట్రంప్ పోస్ట్ చేశారు.గతంలో కూడా ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా జిన్‌పింగ్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అయితే, ఆసక్తికరంగా, ఈ ఆరోపణలు చేసిన కొన్ని గంటలకే చైనా నాయకత్వంతో తన వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: