ఈమధ్య విడుదల అవుతున్న సినిమాలు దేశాలమధ్య ఉన్న విభేదాలను చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు సరిహద్దు దేశాలమధ్య వస్తున్న పోరు, యుద్ధాలు, దెబ్బతింటున్న ద్వైపాక్షిక సంబంధాలను ఆధారం చేసుకుని విడుదల అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన (China) ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) సినిమాపై చైనా మీడియా తీవ్రంగా స్పందించింది. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ పై గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పలు ఆరోపణలు చేసింది. చైనా పత్రికలు ఈ సినిమాను సైద్ధాంతిక విషం నింపుతున్న జాతీయవాద మెలోడ్రామాగా పేరొంది. డ్రాగన్ కంట్రీ ప్రకారం, సినిమా కథనం 2020లో గల్వాన్ లో జరిగిన సంఘటనలను దృష్టితో కాకుండా, భారత బలగాలే చైనా భూభాగంలోకి చొరబడ్డారని, చర్చల సమయంలో హింసాత్మక దాడులు చేసినట్టు బీజింగ్ ఆరోపణలు చేస్తుంది.
Read Also: Anjaw District: ఇండియాలో మొట్టమొదట సూర్యుడిని చూసేది ఈ ఊరి ప్రజలే

నిజాలను సినిమాలో చూపించలేదు: బీజింగ్
భారత్-చైనా గల్వాన్ లో లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని బీజింగ్ వార్త సంస్థలు ఆరోపిస్తున్నాయి. (China) మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని సెటైర్లు వేసింది. ఈ చిత్రానికి చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు అన్నారు. అందువల్ల చైనా పత్రికల్లో గల్వాన్ సినిమాపై అక్కడి మీడియా విషప్రచారం చేయడం సాధారణం అని అన్నారు. అయితే భారత ప్రేక్షకుల దృష్టిలో ‘గల్వాన్’ సినిమా ఒక దేశభక్తితో కూడిన యుధ్ధచిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: