డ్రాగన్ దేశమైన చైనా (China) నిత్యం మనదేశంపై తన వక్రబుద్ధిని చూపించుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ ఏదోఒకవిధంగా భారత్ ను ఇబ్బందికి గురిచేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. భారత్-పాకిస్తాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో జరిగిన యుద్ధం సమసిపోయి రెండుదేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంలో ఉన్నాయి. అయితే భారత్-పాక్ లమధ్య జరిగిన ఘరణను చైనా కొత్త సైనిక హార్ వేర్ ను పరీక్షించడానికి ఉపయోగించుకుంది.
Read Also: Telangana: ఓవర్‌లోడ్ వాహనాలపై తెలంగాణలో కఠిన చర్యలు

ఈ సమాచారాన్ని యూఎస్ కాంగ్రెస్ ప్యానెల్ తాజా నివేదిక బట్టబయలు చేసింది. ఇరు దేశాల మధ్య నాలుగురోజులపాటు జరిగిన ఘర్షణను బీజింగ్ ప్రత్యక్ష పరీక్షా కేంద్రంగా ఉపయోగించుకుందని నివేదిక వెల్లడించింది. కొత్తగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థల పరిధి, మెరుగుదలను పరీక్షించడానికి చైనా ఉపయోగించుకుందని అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ తెలిపింది.
అమెరికా నివేదిక ప్రకారం..
చైనా నూతనంగా తయారు చేసిన, ఆధునికీకరించిన హెచ్క్వీ-9 వాయు రక్షణ వ్యవస్థ, పిఎల్-15 గాల్లోనే లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, జె-10 యుద్ధ విమానాలను పాకిస్తాన్ కు వచ్చింది. లైవ్ టెస్ట్ ట్రైల్ కోసం చైనా ఆ ఆయుధాలను పాకిస్థాన్ కు (Pakistan) ఇచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆయుధాలను పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఉపయోగించింది. దీంతో చైనా తమ ఆయుధాల పనితీరును సమీక్షించింది. అంతేకాదు.. జూన్ 2025లో పాకిస్తాన్ కు 40 జె-35 5వ జనేషన్ ఫైటర్ జెట్ లు, కెజె-500 విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి చైనా ఆఫర్ చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇలా జిత్తులమారి చైనా ఆయుధాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడమే కాకుండా తమ దేశం తయారు చేసిన కొత్త ఆయుధాల పనితీరును సులభంగా పరీక్షించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: