Canada: సాధారణంగా వీకెండ్స్ సమయంలో లేదా నెలాఖరుకు అనేక సూపర్ మార్కెట్లు, మాల్స్ వివిధ వస్తువులపై డిస్కౌంట్లు ప్రకటించడం సాధారణం. వన్ ప్లస్ వన్ ఆఫర్లు(One Plus One Offer) కూడా కనిపిస్తాయి. కానీ సరుకులన్నీ పూర్తిగా ఉచితంగా ఇస్తే? అలాంటి దృశ్యం అరుదుగా కనిపిస్తుంది. అయితే కెనడాలో మాత్రం ఇలాంటి విశేషమైన సూపర్ మార్కెట్లు ఉన్నాయి.
ఆ దేశంలోని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజలలో ఎవరూ ఆకలితో బాధపడకూడదనే లక్ష్యంతో ఈ ఉచిత సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లో నిత్యావసర వస్తువులన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు లేదా అవసరం ఉన్న ఏ వ్యక్తి అయినా అక్కడికి వెళ్లి తమకు కావలసిన సరుకులు తీసుకోవచ్చు.
Read Also: Dharmendra: ధర్మేంద్ర రెండో వివాహం హేమమాలిని వివాహం వెనుక కథ

ప్రభుత్వ గుర్తింపు కార్డులు
ఈ సేవలను పొందాలంటే మొదటగా సంస్థ వద్ద పేరుతో పాటు చిరునామా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయాలి. నమోదు చేసిన ప్రతి వ్యక్తి నెలకు రెండు సార్లు, సుమారు ₹40,000 విలువ చేసే వస్తువులను ఉచితంగా తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రెజీనా అనే సంస్థ సుమారు 700 ఫుడ్ బ్యాంకులను కూడా నడుపుతోంది. ఇతర స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాలు నిర్వహించే ఫుడ్ బ్యాంకులను కలుపుకుంటే కెనడా మొత్తం మీద 5,500కు పైగా ఫుడ్ బ్యాంకులు ఉన్నాయి. అర్హత ఉన్నవారికి ఈ కేంద్రాల్లో ఆహారం పూర్తిగా ఉచితంగా అందజేయబడుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: