
కెనడాలో(Canada) లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాజాగా ఆ దేశంలో ఉంటున్న భారతీయ వ్యాపారవేత్తను చంపిన ఇదే గ్యాంగ్ ప్రముఖ పంజాబ్ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కూడా కాల్పులు జరిపింది. దీంతో పంజాబ్ సంగీత పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చన్నీ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్(Bishnoi Gang) పలుమార్పు కాల్పులు జరిపింది. అయితే ఈ దాడి నుండి చన్నీ, అతని కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుండగులు కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Pakistan:ఆఫ్ఘాన్ భారత్ కు కీలుబొమ్మ.. నిందించడమే పాక్ పని

ఖేడాతో సంబంధాలను బట్టే కాల్పులు
చన్నీ నట్టన్( Canada) ఇంటిపై కాల్పులు మేమే చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సింగర్ తో తమకు ఎటువంటి వివాదాలు లేవని.. కానీ సర్దార్ ఖేడాతో అతనికి సంబంధాలున్నాయని.. అందుకే కాల్పులు జరిపామని చెప్పింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేసింది. సోషల్ మీడియా పోస్ట్ లో, ముఠాలో కీలకపాత్రధారి అయిన గోల్డీ థిల్లాన్ మాట్లాడారు. చన్నీ తమ శత్రువు అయిన సర్దార్ ఖేడాకు దగ్గర అవుతున్నాడని.. వారిద్దరి మధ్య స్నేహం ఎక్కువ అవుతున్న కారణంగా కాల్పులతో వార్నింగ్ ఇచ్చామని అన్నాడు.
బిష్ణోయ్ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకోసం..
బిష్ణోయ్ గ్యాంగ్ అనేది లారెన్స్ బిష్ణోయ్ అనే పేరుమోసిన గ్యాంగ్స్టర్ నాయకత్వంలో నడుస్తున్న ఒక క్రిమినల్ ముఠా. 2014 నుంచి లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ, అక్కడ నుంచే తన ముఠాను నడిపిస్తున్నాడు. ఈ ముఠా భారతదేశం అంతటా, అలాగే కెనడా వంటి విదేశాల్లో కలిపి 700 మందికిపైగా షూటర్లు ఉన్నారని అంచనా. ఈ ముఠా హత్య, దోపిడీ, బెదిరింపులు వంటి అనేక తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కూడా బెదిరించారు. ఆయనను చంపుతామని గతంలో ప్రకటించిన విషయం విధితమే. ఇటీవలే కెనడా ప్రభుత్వం బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: