Jessie Van Rootselaar case : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని కలిచివేసింది. ఓ పాఠశాలలో జరిగిన ఈ దాడిలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడికి పాల్పడింది 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెలార్ అనే వ్యక్తి. కాల్పుల అనంతరం నిందితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
మృతుల్లో నిందితురాలి తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. ఇంట్లో వారిని కాల్చిన అనంతరం సమీపంలోని హైస్కూల్‌లోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు మరియు 12–13 ఏళ్ల వయస్సున్న ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.
Read Also: Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు

పోలీసులు సమాచారం అందిన రెండు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నామని వెల్లడించారు. పాఠశాల లైబ్రరీ, మెట్ల వద్ద మృతదేహాలు కనిపించాయని, దృశ్యం హృదయ విదారకంగా ఉందని తెలిపారు.
మానసిక ఆరోగ్యం పై ప్రశ్నలు
నిందితురాలు గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయుధాల వినియోగంపై ముందుగానే ఫిర్యాదులు అందినట్లు అంగీకరించారు. గతంలో ఇంటి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ, చట్టపరమైన కారణాల వల్ల తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు.
ఈ ఘటనపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఇది దేశానికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తుపాకీ నియంత్రణ చట్టాలు, మానసిక ఆరోగ్య సమస్యలపై మళ్లీ చర్చకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: