అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘డోజ్’ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ)కు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయలేరని ట్రంప్ తెలిపారు. ప్రభుత్వపరమైన నిర్ణయాలను ఆయన సొంతంగా తీసుకోవడానికి కుదరదని తాజాగా మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

దానికి అనుగుణంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ విషయమై ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రభుత్వ ఈ-మెయిల్ చిరునామాతో పాటు వైట్‌హౌస్‌లో ఆఫీస్ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆయనకు ఈ విధులకు గాను ఎలాంటి పారితోషికం కూడా ఇవ్వడం జరగదని తెలిపారు. కాగా, ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్వయంగా ట్రంప్‌తో పాటు ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే పార్టీకి భారీ మొత్తంలో నిధులు కూడా అందజేశారు.