
ప్రపంచవ్యాప్తంగా సరిహద్దు దేశాల మధ్య నిత్యం ఏదో ఒక గొడవలు, యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. (Cambodia) రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా గత కొన్ని రోజులుగా థాయ్ లాండ్-కంబోడియా దేశాలమధ్య సరిహద్దు వివాదంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వానేనా అన్నట్లుగా రెండు దేశాల సైనికులు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో గతకొంతకాలంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కంబోడియా సరిహద్దులో ఉన్న విష్ణువు విగ్రహాన్ని థాయ్ లాండ్ కూల్చేసింది. ఈ ఘటనపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పేర్కొంది. ఇటువంటి అగౌరవకరమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచరుల మనోభావాలను దెబ్బతీస్తాయని.. ఇటువంటివి పునరావృతం కాకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Read Also: North Korea: మరిన్ని క్షిపణులు తయారీకి కిమ్ నిర్ణయం

వివరణ ఇచ్చిన థాయ్ లాండ్
అయితే భారత్ అభ్యంతరంపై థాయ్ లాండ్(Thailand) స్పందించింది. (Cambodia) భద్రత కోసమే విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేశామని.. అంతే తప్ప హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి కాదని థాయ్ లాండ్ స్పష్టం చేసింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో కావాలనే కంబోడియా సైనికులు విగ్రహాన్ని నిర్మించారని ఆ ప్రాంతం తమదేనని.. భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కూల్చేసినట్లుగా వెల్లడించింది. వాస్తవంగా ఆ ప్రాంతం మతపరమైన ప్రాంతం కూడా కాదని వివరణ ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: