Britain-భారతీయులకు గడ్డుకాలం రానున్నది. ఇప్పటికే అమెరికాలో వీసాలపై పలు కఠిన నిబంధనలతో ఇప్పటికే చాలామంది భారీయుతు పెట్టేబేడలను సర్దుకుని ఇండియాకు వస్తున్నారు. దేశంలో చదివేందుకు యువత ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలపై దృష్టిని సారిస్తున్న భారతీయులకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కెనడాలో 80శాతం వీసాలను తిరస్కరించింది.
ఇదే విధానాన్ని బ్రిటన్ కూడా అనుసరిస్తుంది. దీంతో బ్రిటన్ లో నివసిస్తున్న వేలాదిమంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. వీసా గడువు ముగిసినా తమ దేశాలకు తిరిగి వెళ్లని వారిని వెనక్కి తీసుకునే విషయంలో సహకరించని దేశాలపై ఉక్కుపాదం మోపాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్,(India) పాకిస్థాన్, నైజీరియాలు ఉండటంతో, ఆయా దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్ కాబోయే హోంసెక్రటరీ యెవెట్ కూపర్ హెచ్చరించారు.

అక్రమ వలసదారులపై కఠిన నిర్ణయాలు
అక్రమ వలసదారులను నియంత్రించడంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం ‘రిటర్న్స్’ ఒప్పందాలను(Returns’ agreements) (తిరిగి పంపించే ఒప్పందాలు) కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం వీసా గడువు ముగిసినా లేదా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన తమ పౌరులను ఆయా దేశాలు తిరిగి వెనక్కి తీసుకోవాలి. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని దేశాలు సహకరించడం లేదని బ్రిటన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వీసా విధానాన్ని ఒక ‘బేరసారాల అస్త్రంగా’ వాడుకోవాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది.
జాప్యం చేస్తున్న భారత ప్రభుత్వం
బ్రిటన్ హోం ఆఫీస్ గణాంకాల ప్రకారం వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయిన వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2020 నాటికే దాదాపు 20,706 మంది భారతీయులు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా. గత ఏడాది భారత్ సుమారు 7,400 మందిని వెనక్కి తీసుకున్నప్పటికీ, పాస్పోర్టులు లేని వారిని గుర్తించి, వారికి అత్యవసర ప్రయాణ పత్రాలు జారీ చేయడంలో భారత ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని బ్రిటన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం
బ్రిటన్ ఏకపక్షంగా తీసుకునే ఈ నిర్ణయం భారత్ వంటి కీలక భాగస్వామ్య దేశంతో (Bilateral relations) తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైగ్రేషన్ అబ్జర్వేటరీ నిపుణుడు డాక్టర్ పీటర్ వాల్ష్ మాట్లాడుతూ ‘యూకే వీసా వ్యవస్థను అత్యధికంగా వినియోగించుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇటువంటి బెదిరింపు ధోరణిని భారత్ తేలిగ్గా తీసుకోదు. ఇది ఇరుదేశాల మధ్య వాణిజ్య విద్యాసంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని’ అంటున్నారు.
పరువుతీస్తున్న భారతీయులు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆయాదేశాల చట్టాలకు అనుగుణంగా జీవించాలి. వీసాల గడువు తీరినా వాటిని రెన్యూవల్ చేసుకుండా అక్రమంగా నివసించడం మంచిది కాదని ఇప్పటికే భారత్ పలుమార్లు హెచ్చరిస్తూనే ఉంది. ఏదేశంలోనైనా ఆయాదేశాల చట్టాలకు లోబడి జీవించాల్సిందే. వీసా గడువు ముగిసిపోయిన వెంటనే వాటిని తప్పనిసరిగా రెన్యూవల్ చేసుకోవాలి.
కొత్త వీసా ప్రక్రియలో ఏ మార్పులు జరిగాయి?
ఆర్థిక ఆధారాలు, భాషా పరీక్ష ఫలితాలు, విద్యా ప్రణాళిక వంటి అంశాల్లో మరింత కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నారు.
బ్రిటన్ కొత్త వీసా నిబంధనల ప్రభావం ఎవరి మీద ఉంటుంది?
ప్రధానంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వృత్తిపరులపై ప్రభావం ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: