గతకొంత కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎపిస్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేస్తున్న సంగతి విధితమే. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మస్క్ తో సహా చాలామంది పేర్లు బయటకు రావడంతో ఈ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా బ్రిటన్(Britain) యువరాజు ఆండ్రూ(Prince Andrew) పేరు కూడా వినిపించింది. ఈయన పేరు బయటకు రావడంతో ఆయన తన రాయల్ టైటిల్ ను వదులుకున్నారు. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 తన సోదరుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న బిరుదులు అన్నింటినీ తొలగించడమే కాకుండా.. అతన్ని ప్యాలెస్ నుంచి కూడా బయటకు పంపించేశారని తెలుస్తోంది. బకింగ్ హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ప్రకటించింది.

Read Also: TG SET-2025: దరఖాస్తు గడువు పొడిగింపు – నవంబర్ 6వరకు అవకాశం
కాస్త మరక అంటినా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందే..
బ్రిటన్ లో రాజులకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో ఇంకా రాజరిక వ్యవస్థ కొనసాగుతున్నంది. అందుకే వీరు చాలా పద్ధతిగా ఉంటారు. ఏ కాస్త మరక అంటకుండా నిత్యం తమనుతాము కాపాడుకుంటారు. దివంగత రాణి ఎలిజిబెత్ రెండో కుమారుడు, చార్లెస్తమ్ముడూ ఆండ్రూ, ఎపిస్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు బయటకు వచ్చినప్పటి నుంచీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ వదులుకున్నారు. ఇప్పుడు రాజు చార్లెస్ తన తమ్ముడిపై చర్య తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారు.
అంతేకాకుండా ఆండ్రూ ప్రస్తుతం లీజుకు తీసుకుని ఉంటున్న లండన్ లోని విండ్సర్ ఎస్టేట్ ను కూడా ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపించారు. దీంతో ఆండ్రూ తూర్పు ఇంగ్లండ్ లోని సాండ్రిగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్ లోకి మారతారని బకింగ్ హామ్ ప్యాలెస్ పేర్కొంది. అయితే ఆండ్రూ తనపై వచ్చిన ఆరోపణలను చాలాసార్లు తిరస్కరించారు. అయినా కూడా రాజుగా చార్లెస్ తన విధులను నిర్వర్తించాలని భావించడం వల్లనే ఆండ్రూపై చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: