అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాక వాటిలో పనిచేసేందుకు హెచ్1బీ వీసాలు పొందుతున్న భారతీయులు వీటి కోసం ఎందాకైనా వెళ్తున్నారా ? లంచాలు సహా ఎన్ని అడ్డదారులు తొక్కయినా హెచ్1బీ (H1-B)వీసాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా ? అందుకే ట్రంప్ సర్కార్ ఇప్పుడు హెచ్1 వీసా ఇంటర్వ్యూల విషయంలో భారతీయులకు చుక్కలు చూపిస్తోందా ? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందేందుకు భారతీయులు ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారో వివరిస్తూ ఆ దేశ దౌత్యవేత్త, భారతీయ మూలాలున్న మాహవాష్ సిద్దిఖీ ఇమ్మిగ్రేషన్ థింక్ ట్యాంక్ కు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనాలు రేపుతోంది. ఇందులో భారతీయులు హెచ్1బీ వీసాలు పొందేందుకు లంచాలు సహా ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో ఆధారాలతో సహా వివరించారు. అంతే కాదు చివరిగా ట్రంప్ సర్కార్ కు హెచ్1 వీసాల్ని రద్దు చేయాలనే సలహా కూడా ఇచ్చారు.
Read Also: Bangladesh: ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

మోసం, లంచాల ద్వారా వీటిని పొందుతున్నారు
అర్హత లేని భారతీయ హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు మోసం, లంచాల ద్వారా వీటిని పొందుతున్నట్లు ఆమె ఆరోపించారు. కాబట్టి హెచ్1బీ వీసాలపై పూర్తిస్ధాయి సమీక్ష జరిగే వరకూ వాటి జారీని నిలిపేయాలని సిద్ధిఖీ ట్రంప్ సర్కార్ ను కోరారు. వలస వ్యతిరేక థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ స్టడీస్ కు రాసిన లేఖలో ఆమె.. చెన్నైలోని యూఎస్ కాన్సులేట్‌లో జూనియర్ అధికారిగా తన అనుభవాన్ని గుర్తుచేశారు. 20-45 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులలో ఎక్కువ మంది మోసపూరిత లేదా పెంచిన ఆధారాలతో అమెరికాలోకి ప్రవేశించడానికి హెచ్1బీని లొసుగుగా వాడుకుంటున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అమెరికన్ ఐటీ, స్టెమ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నట్లు వివరించారు. కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు ఉన్నట్లు చెప్పుకునే చాలా మంది హెచ్1బీ దరఖాస్తుదారులకు సంబంధిత కోర్సులు లేదా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేవని, వారు ప్రాథమిక కోడింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా ఫెయిల్ అవుతున్నట్లు సిద్ధిఖీ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: