Breaking News బస్సు పై కొండచరియలు విరిగిపడి ఆరుగురు దుర్మరణం ఎక్కడ చూసినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకృతి ఎప్పుడు ఎవరిపై పడి ప్రాణాలు తీస్తుందో తెలియదు. తాజాగా వియత్నాంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించారు. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. వియత్నాం ఆర్థిక రాజధాని హో చి మిన్ లో భారీగా వర్షాలు (rains) కురుస్తున్నాయి.
Read Also: Delhi blast: అల్ ఫలా యూనివర్సిటీతో సహా పలు చోట్ల ఈడీ సోదాలు

ఒక్కసారిగా బసుపై కొండచరియలు
దీంతో అక్కడ కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. హో చి మిన్ సిటీ నుంచి 32 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. సెంట్రల్ హైల్యాండ్స్ లోని ఖాప్ లె పాస్ గుండా పర్వత మార్గంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బసుపై కొండచరియలు పడ్డాయి. దీంతో స్పాట్ లోనే ఆరుగురు మరణించగా.. 16మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: