Breaking News ఏంటో మన జీవితం అంతలో కనిపించి, అంతలోనే మాయమయ్యే ఆవిరివంటి జీవితం. ఉదయం పూసిన గడ్డిపువ్వు సాయంత్రం ఎండిపోయి, గాలికి కొట్టుకునిపోతుంది. మన జీవితం కూడా ఇలాంటిదే. ఎక్కడ చూసినా ప్రమాదాలు, ప్రకృతివైపరీత్యాలతో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి.
ఎందుకు ఇదంతా చెబుతున్నారు అని అనుకుంటున్నారా? ఓ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నదిలో పడి గల్లంతు అయ్యారు. ఈ విషాదకర సంఘటన లిబియాదేశంలో జరిగింది. అక్కడి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Digital Arrest: కేంద్ర మంత్రి సంతకంతో..99 లక్షల దోపిడి

అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి పయనం..
లిబియా(Libya) తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ(boat) సముద్రంలో బోల్తా పడింది. అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్న ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రయాణికుల్లో ఏడుగురు వలసదారులు దాదాపు ఆరురోజుల పాటు సముద్రం మధ్యలో ఉన్నారు. చివరకు లిబియా దేశ అధికారులు వారిని రక్షించారు. గల్లంతైన వారి కోసం అధికారులు అన్వేషస్తున్నారు. అలాగే గల్లంతైన వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: