BREAKING NEWS సౌదీ రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం ప్రతి ముస్లీం (Muslim) జీవితంలో ఒక్కసారైనా సౌదీ అరేబియాలో ఉన్న మక్కాను సందర్శించుకోవాలని ఆశిస్తారు. చనిపోయేలాగా తమ ఇష్ దైవమైన అల్లాకు నమస్కరించాలని, ఆ పవిత్ర ప్రదేశంలో నమాజ్ చేసుకుంటే తమ జీవితం ధన్యకరమవుతుందని ప్రపంచంలోని ముస్లింలు భావిస్తారు. అందుకోసం ఆ దేశానికి ప్రతి ఏడాది కోట్లాదిమంది భక్తులు వెళ్తుంటారు. ఇందులో భాగంగా భారతదేశం నుంచి కూడా ఏటా ముస్లింలు సౌదీ అరేబియాకు పయనం అవుతుంటారు. ఇటీవలే మనదేశానికి చెందిన పలువురు ముస్లింలు అకక్కడికి చేరుకున్నారు.
Read Also: Radhakrishnan: రాజ్‌భవన్‌లో గవర్నర్, సీఎం–ఉపరాష్ట్రపతి భేటీ

అయితే విషాద ఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో (Saudi Arabia)ఘోర బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్లుండగా బదర్ మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్పాట్ లోనే 42 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 20 మంది మహిళలు ఉండగా..11 మంది చిన్నారు ఉన్నారు. ఎక్కువగా వీరిలో హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బాధిక కుటుంబాలకు సాయం
ఈ బసుస ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని రేవంత్ సూచించారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టానలలి ఆదేశించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో సీఎం మాట్లాడారు.
హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 79979 59754, 9912919545 కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. మనదేశానికి చెందిన వారు సైతం మరణించిన వారిలో ఉండడంతో దేశంలోని ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: