BIG Breaking: రష్యాలో మరోసారి భూకంపం భయాందోళనకు గురిచేసింది. సఖాలిన్ ఒబ్లాస్ట్‌లోని సెవెరో-కురిల్స్క్ సమీపంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.
Read Also: Big Breaking: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం
ఉదయం సమయంలో ప్రకంపనలు నమోదు
BIG Breaking: స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:49 గంటలకు, సుమారు 126 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించగానే ప్రాంతంలో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారని సమాచారం.ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు. స్థానిక అధికారులు మరియు రష్యా విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా రష్యా ఉత్తర ప్రాంతాల్లో భూకంపాలు తరచుగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: