సుమారు రూ.13,850 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి) కుంభకోణంలో(Belgium) ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రరాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని భారత్ కు రప్పించే దిశగా భారత ప్రభుత్వం మరో భారీ విజయాన్ని అందుకుంది. తన అప్పగింతను సవాలు చేస్తూ మెహుల్ చోక్సీ దాఖలు చేసిన చివరి అప్పీల్ ను బెల్జియం అత్యున్నత న్యాయస్థానమైన ‘కోర్ట్ ఆఫ్ కాసేషన్’ తాజాగా కొట్టివేసింది. ఈ తీర్పుతో చోక్సీ ని భారత్ కు రప్పించేందుకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఎనిమిది సంవత్సరాలుగా భారత్(India) చేస్తున్న కృషికి నేడు ఫలితం దక్కనున్నది. గతంలో ఆంట్వెర్ప్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇచ్చిన అప్పగింత ఉత్తర్వులను సవాలు చేస్తూ చోక్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత్ లో తనకు న్యాయమైన విచారణ జరిగదని, అక్కడ జైళ్లలో చిత్రహింసలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వాదించారు. అయితే ఈ వాదనలను బెల్జియం సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. భారత్ ఇచ్చిన హామీలు నమ్మదగినవిగా ఉన్నాయని, చోక్సీకి ఎటువంటి ప్రాణహాని లేదా మానవ హక్కుల ఉల్లంఘన జరగదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషన్ వేసినందుకుగాను చోక్సీకి జరిమానా కూడా విధించింది.
Read also: America: హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ముంబై జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు
(Belgium) మెహుల్ చోక్సీని భారత్ కు రప్పించిన తర్వాత ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచుతామని భారత ఏజెన్సీలు కోర్టుకు వివరించాయి. అక్కడి బ్యారక్ నంబరు 12లో ఆయన కోసం అన్ని వసతులతో కూడిన గదిని కేటాయించినట్లు మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని సాక్ష్యాధారాలతో సహా భారత్ నిరూపించింది. ఈ వివరణతో సంతృప్తి చెందిన చెల్జియం న్యాయస్థానం చోక్సీ అప్పగింత ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఆదేశించింది. 2018లో పీఎన్ బీకుంభకోణం బయటపడటానికి కొద్దిరోజుల ముందే చోక్సీ భారత్ నుంచి పరారయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: