ఆసియా కప్ 2025 షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటలకే భారత క్రికెట్ బోర్డు (BCCI) కి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 14న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ చేయడమే ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా ఆ దురంతానికి వ్యతిరేకంగా సంతాపం ప్రకటిస్తున్న తరుణంలో, భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రకటించడం అనేదాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. #BoycottAsiaCup అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది ఒక టోర్నమెంట్ షెడ్యూల్‌పై వచ్చిన సాధారణ నిరసన కాదని, దేశభావనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో
పాక్‌తో మ్యాచ్ ఆడే సమయంలో కనీస భద్రతా పరిస్థితులు, దేశ ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని పేర్కొంటున్నారు.అంతే కాదు, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ (World Championship of Legends Tournament) లో ఇటీవలే భారత జట్టు పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించింది. దేశంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిని నిరసిస్తూ ఇండియా ఛాంపియన్స్ పాక్ ఛాంపియన్స్‌తో ఆడడాన్ని నిరాకరించిందన్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు ఓ అధికారిక అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాక్‌తో తక్షణమే మ్యాచ్ ఆడాలని నిర్ణయించడం అంత్యంత బాధాకరమని, దేశభక్తికి విరుద్ధమని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
చాలా కాలంగా జరుగుతున్న చర్చను
ఎక్స్‌లో చాలా మంది యూజర్లు బీసీసీఐ వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. “ఇది కేవలం క్రికెట్ (Cricket) మాత్రమే కాదు. మన ప్రజల కోసం నిలబడటం” అని ఒక యూజర్ రాశారు. ఈ వివాదం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య క్రీడా సంబంధాలపై చాలా కాలంగా జరుగుతున్న చర్చను మళ్లీ తెర మీదకు తెచ్చింది. క్రీడలు రాజకీయాల నుండి వేరుగా ఉండాలని కొందరు వాదిస్తున్నప్పటికీ, భారత అభిమానుల్లో ఎక్కువ మంది బహిష్కరణకు పిలుపునిచ్చారు.
BCCI అంటే ఏమిటి?
BCCI అంటే “బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా”. ఇది భారతదేశ క్రికెట్‌కు పాలక సంస్థ. దేశంలో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించేది ఇదే సంస్థ.
BCCI స్థాపితమైన సంవత్సరం ఏది?
BCCI 1928లో స్థాపించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: PV Sindhu: లాల్‌దర్వాజలో పీవీ సింధు ప్రత్యేక పూజలు..