బంగ్లా (Bangladesh) లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన 24గంటలల్లో ఇద్దరు హిందువులను హత్య చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నార్సింగ్ది జిల్లా కేంద్రంలోని బ్రాహ్మండికి చెందిన శరత్ చక్రవర్తి మణి స్థానికంగా ఓ కిరాణా షాపు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. మణి గతంలో దక్షిణ కొరియాకు వెళ్లి కొంతకాలం పనిచేసి వచ్చాడు. అక్కడ సంపాదించుకుని వచ్చిన సొమ్ముతో బ్రాహ్మండిలో ఓ ఇల్లు కట్టుకున్నాడు.
Read also: Medak Crime: సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు
కత్తులతో విచక్షణారహితంగా దాడి
ప్రస్తుతం కిరాణా షాపుతో వచ్చే ఆదాయంతో కుటుంబం గడుపుకుంటున్నాడు.ఈ క్రమంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో కొంతమంది దుండగులు మణి షాపు వద్దకు వచ్చారు. వచ్చీరావడంతోనే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో మణి తీవ్ర గాయాలపాలయ్యాడు.

ఆపై దుండగులు పారిపోగా.. స్థానికులు మణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మణిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని ప్రకటించారు.18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: