ఎట్టకేలకు అంతా ఊహించినట్లుగానే షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది. నేడు బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు (Sheikh Hasina) మరణశిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) కాసేపటి క్రితం సంచలన తీర్పు వెలువరించింది. గతేడాది జులైలో జరిగిన ప్రదర్శన సందర్భంగా మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఈ శిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ తీర్పును షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా పక్షపాతంతో కూడిన, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని ఆమె అభివర్ణించారు.
Read Also: Welfare Schemes: ఆదాయ ధ్రువీకరణకు కొత్త నిబంధనలు – రేషన్ కార్డు తప్పనిసరి

యూనస్ నేతృత్వంలో వెలువడిన తీర్పు ఇది: హసీనా
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రిగ్గా ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చిందని హసీనా ఆరోపించారు. ఈ మేరకు ఐఏఎన్ ఎస్ తన కథనంలో వెల్లడించింది. ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని ఈ ప్రభుత్వంలోని కొందరు తీవ్రవాదులు, నన్ను, నా పార్టీ అవామీ లీగ్ ను రాజకీయంగా అంతం చేయాలనే దురుద్దేశంతోనే ఈ కుట్ర పన్నారని’ ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
యూనస్ పాలనలో దేశంలో ప్రజా సేవలు కుప్పకూలాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆమె విమర్శించారు. దేశం ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది, యువతకు ఉపాధి లేక అల్లాడుతున్నదని, అయినా యూనస్ ఏమీ చేయలేని స్థితిలో పాలన కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
నిరసనకారులను చంపమని ఆదేశాలు ఇవ్వలేదు: హసీనా
గతేడాది జరిగిన ఆందోళనల్లో ఇరువర్గాల మరణాల పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, అయితే నిరసనకారులను చంపమని తానుగానీ, తన పార్టీ నేతలు గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని హసీనా స్పష్టం చేశారు. తనపై మోపిన ఆరోపణలను సరైన న్యాయస్థానం ముందు విచారణ జరపాలను తాను తాత్కాలిక ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నానని, అక్కడ తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఐసీసీ విచారణ జరిపితే తమ మానవ హక్కుల ఉల్లంఘనలు బయటపడతాయనే భయంతోనే తాత్కాలిక ప్రభుత్వం తన సవాల్ ను స్వీకరించడం లేదని ఆమె ఆరోపించారు. ఇలాంటి శిక్షలు తనను ఏమీ చేయలేవని, వీటన్నింటిని తాను ధైర్యంగా ఎదుర్కొన్నగలననే ధీమాను వ్యక్తం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: