బంగ్లాదేశ్‌లో(Bangladesh) దీపూ చంద్రదాస్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీపూపై ఎలాంటి ఆధారాలు లేకుండానే తప్పుడు ఆరోపణలు మోపి గుంపుగా దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తీవ్రంగా కొట్టిన అనంతరం అతడు స్పృహ కోల్పోయినా దాడిని ఆపలేదని వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని సుమారు ఒక కిలోమీటరు మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లి, చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టడం ద్వారా దారుణానికి తెరదీశారని తెలిపారు.
Read Also: World Record : చైనా ట్రైన్ వరల్డ్ రికార్డు ,2 సెకన్లలోనే 700kmph వేగం

ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. దీపూ చంద్రదాస్ ఎలాంటి మతాన్నీ అవమానించలేదని, సోషల్ మీడియా పోస్టులు గానీ, బహిరంగ వ్యాఖ్యలు గానీ లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సమాచారం. అతడిపై మత విమర్శల ఆరోపణలు పూర్తిగా అసత్యమని అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
అసూయ, ద్వేషమే హత్యకు కారణమన్న అనుమానాలు
దీపూ హిందువుగా ఉండటమే కాకుండా, తన కృషితో ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నాడనే అసూయతో కొందరు అతడిని లక్ష్యంగా చేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు మతపరమైన రంగు పులుముకుని చివరకు ప్రాణాంతక హింసకు దారితీశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఘటనపై తీవ్ర విమర్శలు.. న్యాయం కోరుతున్న కుటుంబం
ఈ హత్య ఘటనపై మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీపూ కుటుంబ సభ్యులు తమ కుమారుడికి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో(Bangladesh) మైనారిటీల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: