బంగ్లాదేశ్(Bangladesh) రాజకీయాల్లో భారీ కలకలం రేపుతున్న తీర్పులు వెలువడ్డాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాపై(Sheikh Hasina) నమోదు చేసిన తీవ్రమైన ఆరోపణలపై ట్రిబ్యునల్ కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది జరిగిన విద్యార్థుల నిరసనలను హింసాత్మకంగా అణచివేయడంలో ఆమె పాత్ర ఉన్నట్టు కోర్టు అభిప్రాయపడింది. కోర్టు వివరాల ప్రకారం, విద్యార్థుల ఉద్యమంపై అమలు చేసిన కఠిన చర్యల వల్ల 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కేసులో హసీనా సహా మరో ఇద్దరిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఇవన్నీ పరిశీలించిన ధర్మాసనం అందిన ఆధారాలను నిజమని పరిగణించి హసీనాను దోషిగా తేల్చింది.
Read Also: Bangladesh: మా అమ్మకు మరణశిక్ష ఖాయం.. అయినా ఏం చేయగలరు? షేక్ హసీనా కుమారుడు

హసీనా స్పందన: “ఇవి తప్పుడు ఆరోపణలు”
తీర్పు వెలువడిన వెంటనే హసీనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఇవి పూర్తిగా తప్పుడు ఆరోపణలు… ఈ తీర్పును నేను పట్టించుకోను” అని వ్యాఖ్యానించారు. ఇక ఆమెకు గరిష్ఠ శిక్ష పడే అవకాశముందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బంగ్లాదేశ్‌లో(Bangladesh) రాజకీయం మళ్లీ ఉత్కంఠ భరిత దశలోకి వెళ్లింది. హసీనా అనుచరులు కోర్టు తీర్పుని రాజకీయ ప్రతీకారం అని విమర్శిస్తుండగా, ప్రతిపక్షం మాత్రం దీనిని ‘చట్ట పరంగా న్యాయం’గా అభివర్ణిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: