గత సంవత్సరకాలంగా బంగ్లాదేశ్ లో (Bangladesh) రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. దేశ ప్రజలు పెద్ద ఎత్తున మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా చేసిన ఘర్షణలు హింసాత్మకంగా మారింది. దీంతో సైన్యం ఆదేశాలపై హసీనా హుటాహుటిగా భారతదేశానికి రావల్సి వచ్చింది. రిజర్వేషన్లపై ఏర్పడ్డ విభేదాలు చివరికి రాజకీయ హింసకు దారితీసింది. గత ఏడాది ఆగస్టు నుంచి హసీనా భారతదేశంలోనే తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ యూనస్ తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు.
Read Also: Satya Kumar: గిరిజనులు సంస్కృతికి వారసులు

అప్పటి నుంచి బంగ్లాదేశ్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో దేశ ఆర్థిక స్థితి చిన్నాభిన్నంగా మారింది. హింసాత్మక ఘటనల్లో పలు భవనాలను తగలబెట్టడం, ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇక ప్రజల జీవనస్థితి మరింతగా దిగజరుతూనే ఉంది. ఈ నేపధ్యంలో నిన్న షేక్ హసీనాకు ట్రిబ్యూనల్ కోర్టు మరణశిక్ష విధించింది. తీర్పు అనంతరం దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 50 మంది మరణించగా వందలమందికి గాయాలయ్యాయి.
మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మద్దతుదారులు ప్రస్తుత తాత్కాలిక ప్రధాని యూనస్ మద్దతుదారుల మధ్య ఈ హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. కోర్టు తీర్పు నిరసిస్తూ హసీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇది ఇప్పుడు రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
హసీనాను అప్పగించాలని యూనస్ ప్రభుత్వం విజ్ఞప్తి
ఆందోళనకారులను నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే చాలామంది మరణించినట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరణశిక్ష పడిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఉన్నారు. ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ కు విజ్ఞప్తి చేసింది. హసీనాను అప్పగిస్తేనే దేశంలో అల్లర్లు తగ్గుతాయని తాత్కాలిక ప్రభుత్వం భావిస్తోంది.
దీనిపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హసీనా అప్పగింత అనేది రెండు దేశాల రాజకీయ దౌత్యపరమైన అంశంగా మారింది. ఈ అంశంపై భారత్ అతీసుకునే నిర్ణయం బంగ్లాదేశ్ లోని ప్రస్తుత పరిస్థితులపై ప్రభావం చూపవచ్చు. ఏదీఏమైనా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తన ఉరిశిక్షపై హసీనా కూడా స్పందించారు. తాను దేనికీ భయపడేది లేదని చెప్పారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: