బంగ్లాదేశ్ భారతదేశంతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బంగ్లాదేశ్ లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్ ఖోజిన్ సూచించారు. భారతదేశంతో ఉద్రిక్తతను ఎంత త్వరగా తగ్గిస్తే బంగ్లాదేశ్ కు అంత మంచిది అని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడం రెండు దేశాలకు, మొత్తం దక్షిణాసియాకు చాలా కీలకమని అన్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంతో భారత్, రష్యా పోషించిన పాత్రను కూడా అలెగ్జాండర్ గుర్తు చేశారు. 1971లో ప్రధానంగా భారతదేశం సహాయంతో బంగ్లాదేశ్ (Bangladesh) స్వాతంత్ర్యం పొందింది. రష్యా కూడా దీనికి మద్దతు ఇచ్చింది అని ఖోజిన్ అన్నారు.
Read also: Jeffrey Epstein Case: ట్రంప్ మంచోడు.. 30,000 పేజీలను విడుదల చేసిన న్యాయశాఖ

Bangladesh
ద్వైపాక్షిక సంబంధాలలో రష్యా జోక్యం చేసుకోదు
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో రష్యా జోక్యం చేసుకోవడం లేదు, అయితే ఉద్రిక్తతను మరింత పెంచకుండా ఉండే మార్గాన్ని వెతకడం తెలివైన పని.. పరస్పర విశ్వాసంపై సంబంధాలు ఆధారపడి ఉండాలి అని అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్ అన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతపై రష్యా ఇప్పటివరకు మౌనంగా ఉన్నందున రష్యా రాయబారి చేసిన ఈ వ్యాఖ్య కీలకంగా మారింది. నిజానికి, బంగ్లాదేశ్ లోని పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు.. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ మరణంపై సంతాపాలు ప్రకటిస్తున్న వేళ రష్యా వారందరికీ భిన్నంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో భారత్ పాత్రను ప్రస్తావించింది. తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే పొరుగు దేశమైన భారత్ తో సంబంధాలు చేజారిపోకుండా చూస్తామని ఆర్థిక స్థిరత్వం కోసం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: