బంగ్లాదేశ్ లో (Bangladesh) రాజకీయ ఆనిశ్చితి కొనసాగుతున్నది. నిన్న (సోమవారం) మాజీ ప్రధాని షేక్ హసీనాకు ట్రిబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించడంతో బంగ్లాలో ఘర్షణలు జరుగుతున్నాయి. హసీనాకు ఉరిశిక్ష విధించడంపై ఆమె మద్దతుదారులు మళ్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ వర్గీయులకు, షేక్ హసీనా వర్గీయులకు మధ్య ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ హింసాత్మక దాడుల్లో 50మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.
Read Also: Tummala Nageswara Rao: నేటి నుండి పత్తి కొనుగోళ్లు చేయాలి
వందల సంఖ్యలో గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే షేక్ హసీనాకు ఉరిశిక్ష తీర్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ తీర్పును గౌరవిస్తామని భారత్ చెప్పినప్పటికీ హసీనాను అప్పగించేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. యూనస్ ప్రభుత్వం మాత్రం ఆమెను తమకు అప్పగించాలని, అప్పుడు గొడవలు తగ్గుముఖం పడతాయని భారత్ కు విజ్ఞప్తి చేస్తున్నది. దీనిపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

భారత్ పై కక్షతోనే ఈ తీర్పు
షేక్ హసీనా (Sheikh Hasina) అరెస్టు ను ఐక్యరాజ్యసమితి తప్పుపట్టింది. కావాలనే హసీనా మరణశిక్ష కావాలని విధించిందేనని, దానిద్వారా భారత్ పై కక్ష తీర్చుకుందామని బంగ్లాదేశ్ అనుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 5, 2024 న బంగ్లాదేశ్ లో జరిగిన అతిరుగుబాటు తర్వాత షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ లు ఇద్దరూ భారత్ లోనే ఉంటున్నారు.
నేరం రుజువుకాకుండానే మరణశిక్ష
మాజీ దౌత్యవేత్త షోక్స జ్జనార్ ప్రకారం బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ లోని న్యాయమూర్తులందరినీ ముహమ్మద్యూనస్ ఎంపిక చేశారు. దీంతో వీరందరూ ఆయన ఏం చెబితే అది చేస్తారు. బంగ్లాదేశ్ లో మరణాలకు కారణం షేక్ హసీనా అని నిరూపించబడలేదు. అయినప్పటికీ ఆమెకు మరణశిక్ష విధించారు. అంతేకాదు భారత్ వెంటనే ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం డిమాండ్ కూడా చేసింది. ఇదంతా కావాలనే చేస్తున్నారని మాజీ దౌత్యవేత్తలు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ తో కలిసి బంగ్లాదేశ్ భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు. షేక్ హసీనా మరణశిక్ష కూడా అందులో భాగమేనని చెబుతున్నారు.
పాక్ తో చేతులు కలిపిన యూనస్
షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ ను విడిచి పెట్టాక అక్కడ ప్రభుత్వం మహ్మద్ యూనస్ (Muhammad Yunus) చేతుల్లోకి వెళ్లింది. బంగ్లా తాత్కాలిక అధిపతిగా యూనస్ ఉన్నారు. అయితే ఇది జరిగి 15 నెలలు అవుతున్నా అకక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. అసలు ఆ వూసే ఎత్తడం లేదు. ఎన్నికలు నిర్వహించడం కంటే బంగ్లాను పాకిస్తాన్ లా రాడికల్ దేశంగా మార్చడానికే యూనస్ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. అంతేకాక ఆయన పాక్ తో చేతులు కలిపి భారత్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీనికి నిదర్శనంగా స్వయంగా యూనస్ భారత్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడాన్ని ఉదహరణగా చూపుతున్నారు. పాక్ సైన్యం, ఐఎస్ ఐ బంగ్లాదేశ్ లో చురుగ్గా పని చేస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ప్రపంచం నలుమూలల నుంచీ మతాధికారులు బంగ్లాదేశ్ లో సమావేశమయ్యారని చెబుతున్నారు.
వీరందరూ కలిసి బంగ్లాదేశ్ తో సహా ప్రతి చోటా దైవ దూషణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇందులో దాదాపు 36మంది మతాధికారులు ఒక్క పాకిస్తాన్ నుంచే వచ్చారని తెలుస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు కలిసి భారత్ కు వ్యతిరేకంగా ఆడుతున్న డ్రామా అనే విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలనుకుంటోందని రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ సంజయ్ మెస్టన్ అంటున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: