బంగ్లాదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి, ఓ వెలుగు వెలిగిన బేగం ఖలీదా జియా (Khaleda Zia) ఐసీయూలో ఉన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ (Bangladesh) నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు బేగ ఖలీదా జియా (79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను కుటుంబ సభ్యులు నిన్నరాత్రి ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Also: TG Crime: ఘట్కేసర్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

కొనసాగుతున్న వైద్యం
ఖలీదా జియాకు యాంటీబయాటిక్స్ తో తక్షణ చికిత్స ప్రారంభించినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నప్పటికీ, త్వరలోనే మెరుగయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె చికిత్సకు అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి నిపుణులు కూడా వర్చువల్గా సహాయం అందిస్తున్నారు. సమాచారం తెలియగానే బీఎన్ పి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.
పార్టీకి చెందిన ముఖ్య నేతలు, సుమా షమీలా రహ్మాన్ వంటివారు ఆసుపత్రి వద్దే ఉండి ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఖలీదా జిలా గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. షేక్ హసీనా, (Sheikh Hasina) బేగం ఖలీదా జియా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భంగుమనేలా వీరి పాలన కొనసాగింది. నిత్యం నువ్వా నేనా అనేలా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో తమ పాలనను సాగించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: