బంగ్లాదేశ్(Bangladesh) లో రాజకీయంగా కీలక మలుపు తిరుగుతూ.. 2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ఎఎంఎం నాసిర్ ఉద్దీన్ టెలివిజన్ ద్వారా ప్రకటించారు. గతేడాది ఆగస్టులో జరిగిన హింసాత్మక ఆందోళనల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతుండగా.. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ ఆ దేశ పరిస్థితులు చక్కబడలేవు. ముఖ్యంగా ఇప్పటికీ అక్కడ రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అన్ని పార్టీల వారితో పాటు ప్రజలు కూడా ఎన్నికలు నిర్వహించాలని గొడవ చేశారు. ఈక్రమంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కాగా.. సీఈసీ ముహూర్తం ఫిక్స్ చేసింది.
Read Also: Mexico tariffs :మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?…

డిసెంబర్ 29వ తేదీ నుంచి నామినేషన్లు
బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారు అయింది. ముఖ్యంగా డిసెంబర్ 29వ తేదీ నుంచి నామినేషన్లు వేయాల్సి ఉండగా.. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 127.6 మిలియన్లకు పైగా ఉండగా.. వీరంతా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికలతో పాటు జులై నేషనల్ చార్టర్ అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ డా అదే రోజు జరగనుంది. ఒకే రోజు పార్లమెంటరీ ఎన్నికలతో పాటు రాజ్యాంగ సంస్కరణలపై రెఫరెండం నిర్వహించడం బంగ్లాదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ఈ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) వ్యతిరేకించడం గమనార్హం.
అవామీ లీగ్‌పై కొనసాగుతున్న నిషేధం
దేశ రాజకీయాలపై ఈ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఆగస్టు 2024 ఆందోళనల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలను నిషేధించారు. దీంతో గణనీయమైన మద్దతు ఉన్న అవామీ లీగ్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం, ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు హసీనా పాలనలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఎన్‌పీ ఈ ఎన్నికల్లో ముందున్నట్లు భావిస్తున్నారు. అలాగే 2024 ఆగస్టులో జరిగిన ఆందోళనలకు నేతృత్వం వహించిన విద్యార్థి ఉద్యమం నుంచి పుట్టిన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP), జమాత్-ఏ-ఇస్లామీకి చెందిన అమర్ బంగ్లాదేశ్ (ఏబీ) పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. షేక్ హసీనా తొలగింపు తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రావాలని పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు అంతర్జాతీయ పరిశీలకులకు, ముఖ్యంగా భారత్‌కు ఆసక్తికరంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :