Election results 2026 : బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు బొగ్రా-6, ఢాకా-17 రెండింటిలోనూ ఘన విజయం సాధించారు.
17 ఏళ్ల ప్రవాసం అనంతరం దేశానికి తిరిగి వచ్చిన తారిఖ్ రెహమాన్‌కు ప్రజలు విశేష మద్దతు ప్రకటించారు. ఎన్నికల సంఘం ప్రాథమిక గణాంకాల ప్రకారం బొగ్రా-6లో ఆయన దాదాపు 2.16 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ఢాకా-17లో కూడా స్పష్టమైన ఆధిక్యత సాధించారు.
ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 300 పార్లమెంట్ స్థానాల్లో బీఎన్‌పీ 185 స్థానాల్లో ముందంజలో నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని దాటేసింది. జమాత్-ఇ-ఇస్లామీ సుమారు 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అవామీ లీగ్ పోటీలో లేకపోవడం ఈ ఎన్నికల దిశను ప్రభావితం చేసింది.
Read Also: Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు
విజయం ఖాయమవుతుందనే అంచనాలతో బీఎన్‌పీ (Election results 2026) కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభించారు. తారిఖ్ రెహమాన్ త్వరలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. “ఇది ప్రజాస్వామ్య విజయమే. చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడం మా మొదటి లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: