బంగ్లాదేశ్ లో గత డిసెంబరు 12న హత్యకు గురైన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది పార్టీ మంగళవారం ఢాకాలో ఒకరోజు ర్యాలీని నిర్వహించింది. ఆయన హత్యకు న్యాయం చేయాలని, బంగ్లాదేశ్ లో నివసిస్తున్న భారతీయులందరి పని అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ర్యాలీ నిర్వహించారు. ‘ఇంకిలాబ్ మోంచో భారతదేశంలో ఆశ్రయం పొందారని ఆరోపించిన హంతకులను స్వదేశానికి రప్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. న్యూఢిల్లీ (New Delhi) వారిని అప్పగించేందుకు నిరాకరిస్తే ఢాకా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని హెచ్చరించిందని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.
Read also: Parliament: ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

massive rally was held demanding the cancellation of work permits for Indians
తోసి పుచ్చిన భారత్
హదీ హంతకులు భారతదేశంలోకి ప్రవేశించారనే వాదనలను భారత అధికారులు తోసిపుచ్చారు. అక్రమ సరిహద్దు కదలికకు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ‘హది రక్తాన్ని వృధాగా పోనివ్వం, నా సోదరుడు సమాధిలో పడి ఉండగా హంతకుడు ఎందుకు స్వేచ్ఛగా ఉన్నాడు, ఆకుపచ్చ జెండా, ఇంకిలాబ్ జెండా వంటి నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. హదీ పార్టీ మద్దతుదారులు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ లోని ఫాసిస్ట్ సహచరులను గుర్తించి, అరెస్టు చేసి, చట్టం ముందు ప్రవేశపెట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారని నివేదిక పేర్కొంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనానికి దారితీసిన జులై-ఆగస్టు 2024 సామూహిక నిరసనల సమయంలో జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్రముఖ యువనాయకుడు 32 ఏళ్ల హది, డిసెంబర్ 12న ఢాకాలో ఎన్నికల ప్రచారంలో తలపై కాల్చి చంపబడిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: