గత సంవత్సరం ఆగస్టు నెలలో బంగ్లాదేశ్లో (Bangladesh) దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఘర్షణల్లో ఆ దేశాన్ని విడిచిపెట్టి, భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై (Sheikh Hasina) నేడు తీర్పు వెలువనున్నది. దీంతో ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బంగ్లా రాజకీయాలు చలికాలంలో హీట్ ను పుట్టిస్తున్నది. మానవత్వ వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం తీర్పు వెలువరించనుంది.
ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ కొనసాగుతుండగా.. షేక్ హసీనా కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లికి మరణశిక్ష పడడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన తీర్పు, విచారణను టీవీల్లో కూడా చూపించనున్నారని చెప్పారు. తన తల్లికి మరణశిక్ష పడినా..అమెను ఎవరూ ఏం చేయలేరని పేర్కొన్నారు.
Read Also: Latest news: Madan Shah: ఆర్జేడీ ఓటమి పై మాజీ నేత మదన్ షా కీలక వ్యాఖ్య

తీర్పు ఎలా ఉండబోతుందో మాకు తెలుసు: వాజేద్
ప్రస్తుతం వాషింగ్టన్ లో నివసిస్తున్న షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్.. ఈ పరిణామాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేవారు. మా అమ్మపై నమోదైన కేసుల్లో తీర్పు ఎలా ఉండనుందో మాకు తెలుసని అన్నారు. బహుశా ఆమెకు మరణశిక్ష విధిస్తారేమోనని
అన్నారు. అయినా తన తల్లి సురక్షితంగా ఉన్నారని ఆయన ధైర్యాన్ని వ్యక్తం చేశారు. ఆమె భారత్ లో సురక్షితంగా ఉంది అని వాజేద్ అన్నారు. ప్రస్తుతం హసీనా బంగ్లాదేశ్ వీడి భారత్ లోని ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నారు.
వెనక్కి తగ్గేదే లేదు: హసీనా
అవామీ లీగ్ పాలనలో దోపిడీలు, నేరాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు నేరగాళ్లు హీరోలు అవుతున్నారు. ఇలాంటి చర్యలతో నా గళాన్ని అణచివేయలేరు’ అని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఈ కుట్రల వల్ల ఎంతో బాధతో తాను స్వదేశాన్ని విడిచి పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. తనపై వచ్చే తీర్పులకు వ్యతిరేకంగా దేశమంతా ‘లాక్ డౌన్’ తీసుకురావాలని ఆమె తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: