ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో శ్రీలంక జట్టు విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో వానిందు హసరంగా చెలరేగగా, బ్యాటింగ్‌లో పాతుమ్ నిస్సంక అద్భుతమైన హాఫ్ సెంచరీ (Half a century) తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ (Bangladesh) మొదట బ్యాటింగ్ చేపట్టింది. లంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా బ్యాట్స్‌మెన్లు స్వేచ్ఛగా రాణించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగారు. జాకెర్ అలీ 34 బంతుల్లో 2 ఫోర్లతో 41 పరుగులు సాధించాడు. అలాగే షమీమ్ హొస్సేన్ (Shamim Hossain) 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

కీలక ఇన్నింగ్స్
మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోవడంతో బంగ్లాదేశ్ స్కోరు మితమైన స్థాయిలోనే ఆగిపోయింది.అనంతరం శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కమిల్ మిషార(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి ధాటికి 32 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక లక్ష్యాన్ని చేధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్(2/29) రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ షకీబ్ చెరో వికెట్ పడగొట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: