Awareness : అవగాహనతో, ఆత్మస్థయిర్యంతో క్యాన్సర్ ను జయించవచ్చునని (Cancer can be defeated.) మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ అన్నారు. 16 ఏళ్లకే తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డానని ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ తెలిపారు. అవగాహనతో తొలి దశలోనే వైద్యం తీసుకున్నానని దానితో బ్రెస్ట్ క్యాన్సర్ను జయించానని ఉద్ఘాటించారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. తొలి దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని తెలిపారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ప్రపంచ సుందరీమణులు సందడి చేస్తున్నారు. తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో గ్రామంలో మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ. మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ పర్యటించారు. డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని సుందరీమణులు దర్శించుకున్నారు. మంగళ హారతులు ఇచ్చి కుంకుమ బొట్లు పెడుతూ గ్రామస్తులు సుందరీమణులకు స్వాగతం పలికారు. దేవస్థాన ప్రాంగణంలో భారతదేశ సాంప్రదాయ కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు చూసి సుందరీమణులు మురిసిపోయారు. కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో సుధారెడ్డి ఫౌండేషన్ – మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్, సుధారెడ్డి ఫౌండేషన్ అధినేత సుధారెడ్డి ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా మిస్ వరల్డ్ (Miss World) ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ హాజరయ్యారు. పేద మహిళలకు ఆరోగ్యాన్ని సంరక్షించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు తమలాంటి వారికి ఆదర్శనీయమని కొనియాడారు.

గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం ఉచిత క్యాన్సర్ పరీక్షలు – అవగాహనతోనే రక్షణ
గ్రామీణ మహిళలు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వస్తుందని సుధారెడ్డి ద్వారా తెలుసుకున్నానని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని వెల్లడించారు. తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిని గుర్తించి తగ్గించుకోవచ్చని ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి: కృష్ణా గ్రావిడెజ్ :మహిళలు ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు మున్ముందు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతామని కృష్ణా గ్రావిడెజ్ చెప్పుకొచ్చారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహనతో పాటు తొలి దశలోనే చికిత్స అవసరమని చెప్పుకొచ్చారు. ళ్ళీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు మెడికల్ సపోర్ట్ ఉండటం చాలా గ్రేట్ అని కృష్ణా గ్రావిడెజ్ పేర్కొన్నారు. సుధారెడ్డి ఫౌండేషన్ మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సుధారెడ్డి ఫౌండేషన్ అధినేత సుధారెడ్డి తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :