బంగ్లాదేశ్ (Bangladesh) లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యారు.మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ బైరాగి (45) అనే వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. గతంలో ఖోకన్ దాసి, అమృత్ మండల్, దీపూ దాస్ వంటి హిందువులు మూక దాడుల్లో హతమైన విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనలతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Read also: Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన

దర్యాప్తు ప్రారంభం
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రాణా ప్రతాప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన వారు ఎవరు? హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసనలు,
ఉద్రిక్తతల మధ్య హిందూ మైనారిటీల భద్రతపై ఈ ఘటన మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజివుల్లా ఖాన్ స్పందిస్తూ.. మేము ఘటనా స్థలంలో ఉన్నాము. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాము అని తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: