ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కి శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక కీలక నిర్ణయం తీసుకున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పిచ్ పరిస్థితులనే దృష్టిలో ఉంచుకుని చేశారు అని ఆయన తెలిపారు. కొత్త పిచ్‌పై బౌలింగ్ చేయడం ద్వారా ప్రత్యర్థి బ్యాటింగ్‌కి ఇబ్బంది కలిగించాలన్నే లక్ష్యం. “మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఈ పిచ్ కొత్తగా ఉంది. అందుకే నిర్ణయం తీసుకున్నాం. ఆసియాకప్ 2022లో మా విజయం ఒక మంచి జ్ఞాపకం. ఆ జోరు కొనసాగాలని కోరుకుంటున్నాం” అని అసలంక (Charit Asalanka) పేర్కొన్నారు.
కెప్టెన్ (Captain) గా నాకు ఇది అతిపెద్ద సవాల్. మా జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. 7 మంది బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. హసరంగా కూడా ఆడుతున్నాడు.’అని అసలంక చెప్పుకొచ్చాడు.ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాసన్ (Bangladesh captain Liton Dasan) అన్నాడు. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేసేందుకు రెడీ. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో బాగానే ఆడాం. కొన్ని విషయాల్లో మెరుగవ్వాలి. ఒక మ్యాచ్ గెలవాలంటే ప్రతిదీ సరిగ్గా జరగాలి. టస్కిన్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

అతని స్థానంలో షోరిఫుల్ వచ్చాడు
అతని స్థానంలో షోరిఫుల్ వచ్చాడు.’అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు.బంగ్లాదేశ్ : పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్ (వికెట్ కీపర్/కెప్టెన్), తౌహిద్ హృదయ్, జకర్ అలీ, షమీమ్ హుస్సేన్, మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ షకీబ్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహమాన్.శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కమిల్ మిషార, కుసల్ పెరెరా, చరిత్ అసలంక(c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మతీషా పతిరణ, నువాన్ తుషార.
Read hindi news: epaper.vaartha.com
Read Also: