ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో సూపర్ ఫోర్ దశలో భాగంగా సెప్టెంబర్ 21న జరిగే అత్యంత ప్రతీక్షితమైన మ్యాచ్ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతోంది.పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ గత మ్యాచ్‌లో జరిగిన ఒక వివాదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మ్యాచ్ రిఫరీని మార్చాలని ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ పాకిస్తాన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆసియా కప్ 2025లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్నాయి.
ఈ దశలో భాగంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా, సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) నాయకత్వంలోని పాకిస్తాన్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనుంది. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. అయితే, అతని నియామకంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.వాస్తవానికి ఆదివారం మ్యాచ్‌కు చెందిన మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఇంకా పబ్లిక్‌గా ప్రకటించలేదు.

మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అడ్డుకున్నారని
ఈ టోర్నీలో విండీస్ మాజీ ప్లేయర్ రిచీ రిచర్డ్‌సన్ (Richie Richardson) కూడా మ్యాచ్ రిఫరీగా ఉన్నారు.సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో టాస్ తర్వాత ఇద్దరు కెప్టెన్‌లు హ్యాండ్‌షేక్ చేసుకోకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అడ్డుకున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. దీనిపై పాక్ అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పైక్రాఫ్ట్ ప్రవర్తన కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఉందని, అతనిపై విచారణ జరిపి, మ్యాచ్ రిఫరీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.ఐసీసీకి రెండు సార్లు పాక్ క్రికెట్ బోర్డు లేఖ కూడా రాసింది.
తాము ఆడే మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఆ రెండు డిమాండ్లను ఐసీసీ (ICC) తిరస్కరించింది. ఎలైట్ ప్యానెల్ రిఫరీలకు అండగా ఐసీసీ నిలిచింది.పైక్రాఫ్ట్ విషయంలో పాకిస్థాన్ అసంతృప్తితో ఉన్నా.. ఐసీసీ మాత్రం ఆ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌ను తొలగించేందుకు సుముఖంగా లేదు. దీంతో రెండోసారి కూడా ఆయనే రిఫరీగా చేసే అవకాశాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: