ఆసియా కప్ 2025 (2025 Asia Cup) టోర్నమెంట్ సూపర్-4 దశలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అద్భుతమైన ఆరంభం చేసింది. శ్రీలంకతో శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ సమష్టి ప్రదర్శనతో 4 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో సూపర్-4 దశలో బంగ్లాదేశ్ జట్టు తన మొదటి పాయింట్లను నమోదు చేసుకొని టోర్నీలో తన పోరాట సత్తాను చాటింది.
ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన బంగ్లాదేశ్ (Bangladesh).. అనంతరం బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. డసన్ షనక(37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండీస్(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34), పాతుమ్ నిస్సంక(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక
బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/20) మూడు వికెట్లు తీయగా.. మెహ్‌ది హసన్(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. టస్కిన్ అహ్మద్ (Taskin Ahmed) ఒక వికెట్ తీసాడు.అనంతరం బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ సైఫ్ హసన్(45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), టౌహిడ్ హృదయ్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

బంతుల్లో బంగ్లా విజయానికి 1 పరుగుల
శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/22), డసన్ షనక(2/21) రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, దుష్మంత చమీరా ఒక వికెట్ పడగొట్టాడు.ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. జాకెర్ అలీ (Zaker Ali) బౌండరీ బాది స్కోర్లను సమం చేశాడు. అయితే మరుసటి బంతికే అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
క్రీజులోకి వచ్చిన మెహ్‌దీ హసన్ ఓ బంతిని డాట్ చేసి మరుసటి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో చివరి 2 బంతుల్లో బంగ్లా విజయానికి 1 పరుగుల అవసరమైంది. కానీ క్రీజులోకి వచ్చిన షమీమ్ హొస్సేన్(1) ఎలాంటి తప్పిదం చేయకుండా సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: