వాషింగ్టన్ : మరో తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సాయికుమార్ ఆత్మహత్య గురించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందకపోవటంతో.. సాయికుమార్‌తో ఉంటున్న స్నేహితులు అమెరికా నుంచి తెలుగు మీడియా ఛానళ్లకు సమాచారం అందించారు. తమ దగ్గర సాయికుమార్ కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో ఆత్మహత్య విషయం వారికి చేరవేయలేకపోయినట్టు చెబుతున్నారు.

కాగా, ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లిన సాయికుమార్ రెడ్డి అటు చదువుకుంటూనే.. న్యూయార్క్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అయితే.. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయి కుమార్ రెడ్డి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. దీంతో.. ఆందోళనకు గురైన యువకుడు తనను ఏం చేస్తారో.. ఇంటికి వెళ్లలేనేమో.. అన్న భయంతో కఠిన నిర్ణయం తీసుకుంది. క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. అమెరికాలోకి వచ్చిన అక్రమ వలసదారుల పట్ల తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. అక్రమవలసదారులను దారుణంగా సంకేళ్లేసి స్వదేశాలకు పంపిస్తున్న ఘటనలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.