Anmol Bishnoi : జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు డిపోర్ట్ చేసిన వెంటనే NIA బుధవారం (నవంబర్ 19, 2025) అరెస్ట్ చేసింది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్‌పై పలువురు కేసులు ఉండగా, ఇప్పుడు NIA నమోదు చేసిన టెరర్–గ్యాంగ్‌స్టర్ కూటమి కేసులో అరెస్ట్ అయిన 19వ నిందితుడు అయ్యాడు.
NIA వెల్లడించిన వివరాల ప్రకారం, 2020 నుంచి 2023 మధ్య జరిగిన పలు ఉగ్ర–నేర కార్యకలాపాల్లో అన్మోల్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. 2023 మార్చిలో అతనిపై అధికారికంగా కేసులు నమోదు చేయగా, తన అన్న లారెన్స్ బిష్ణోయ్ మరియు కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో కలిసి భారతదేశంలో గ్యాంగ్ కార్యకలాపాలను రిమోట్‌గా నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Telemetry Issue: కృష్ణా పర్యవేక్షణలో నిలకడపై ప్రశ్నలు
అమెరికాలో ఉన్నప్పటికీ, అన్మోల్ బిష్ణోయ్ భారతదేశంలోని గ్యాంగ్ సభ్యులను సమన్వయం చేయడం, షూటర్లకు ఆశ్రయం మరియు లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం, విదేశాల నుంచి ఎక్స్‌టోర్షన్ రాకెట్లను నడిపించడం వంటి పనులను కొనసాగించినట్లు (Anmol Bishnoi) విచారణలో బయటపడింది.
అన్మోల్ బిష్ణోయ్, గత సంవత్సరం ముంబైలో జరిగిన ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధీకి హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడు. ఆ సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
ఈ హత్యకు సంబంధించి అన్మోల్‌కు సన్నిహితుడైన షుబూ లోంకార్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ బాధ్యత స్వీకరించిన విషయం గుర్తుంచుకోవాలి. ఈ హత్యను 2024 ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో అరెస్టైన అనుజ్ థాపన్ మరణానికి ప్రతీకారంగా చేశామని అతను పేర్కొన్నాడు. అనుజ్ థాపన్ పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో ముంబై పోలీసులు వెల్లడించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :