हिन्दी | Epaper

Andhra Pradesh students abroad : విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్, కారణం ఇదే!…

Sai Kiran
Andhra Pradesh students abroad : విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్, కారణం ఇదే!…

Andhra Pradesh students abroad : భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విదేశీ విద్యపై అత్యధిక ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. NITI Aayog విడుదల చేసిన ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం, విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఏపీ విద్యార్థులే అగ్రస్థానంలో నిలిచారు.

నివేదిక గణాంకాల ప్రకారం, 2016లో విదేశాల్లో చదువుతున్న ఏపీ విద్యార్థుల సంఖ్య 46,818గా ఉండగా, 2018 నాటికి అది 62,771కి పెరిగింది. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో 2020లో ఈ సంఖ్య 35,614కి తగ్గినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఏపీ విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

TG Politics: తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ

ఏపీ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. (Andhra Pradesh students abroad) 2024 నాటికి మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని వెల్లడించింది. వీరిలో సుమారు 8.5 లక్షల మంది యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొంది. 2016 నుంచి 2024 మధ్యకాలంలో విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో 8.84 శాతం వృద్ధి రేటు నమోదైందని వెల్లడించింది.

విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏటా సుమారు రూ.6.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నారని, ఇది దేశ జీడీపీలో దాదాపు 2 శాతానికి సమానమని నివేదిక స్పష్టం చేసింది. ఈ ఖర్చులే భారత్ ట్రేడ్ డెఫిసిట్‌లో సుమారు 75 శాతం వరకు కారణమవుతున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, విదేశాల నుంచి ఒక విద్యార్థి భారత్‌కు చదువుకోడానికి వస్తే, 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని నివేదిక స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870