సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తాన్చ్ ఏ.కె.నాథన్ భేటీ
విజయవాడ: మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ (Eversendai Corporation) బెర్హాద్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్ ఏ. కె. నాథన్ ముఖ్యమంత్రితో సమా వేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్ట దీని విశాఖ లేదా కృష్ణపట్నం లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎవర్సెండై చైర్మన్ వివరించారు. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఎవర్సెండై ప్రతిపాదించింది.

ఈ కొత్త ఫ్యాక్టరీను వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేసేందుకు వీలుగా ఎవర్సెండై ఆలోచన చేస్తోంది. ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా రాష్ట్రానికి పరిశ్రమల్లో వృద్ధి, ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశంఉంది. అటు అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణంలో మోలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతామని ఎవర్సెండై ఆసక్తిని తెలిపింది. అలాగే రాష్ట్రం లోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ సెంటర్ స్థాపనపైనా ఎవర్సెండై చైర్మన్ ముఖ్యమంత్రితో చర్చించారు. గతంలో బుర్జ్ ఖలీఫా, పెట్రోనాస్ టవర్ సహా చెన్నైలోని డీఎల్ఎఫ్ డౌన్ టౌన్ తారామణి ప్రాజెక్టు, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ పనుల్లోనూ పాల్గొన్నట్టు ఎవర్సెండై వివరించింది.
ఎవర్సెండై కార్పొరేషన్ ఏంటి?
ఎవర్సెండై కార్పొరేషన్ (Eversendai Corporation) మలేషియాకు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ సంస్థ. ఇది స్టీల్ స్ట్రక్చర్స్, పవర్ ప్లాంట్స్, ఆపై శక్తివంతమైన నిర్మాణ సాంకేతికతలో నిపుణత కలిగిన కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ దేశాలు, ఆసియా, భారతదేశంలో భారీ ప్రాజెక్టుల్లో పాల్గొంది.
ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది?
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ, మరియు సంబంధిత ప్రభుత్వ విభాగాలు ఎవర్సెండై ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, ల్యాండ్ అవతరణ, ప్రోత్సాహక విధానాల గురించి వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Medical mafia: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మెడికల్ మాఫియా దారుణాలు