हिन्दी | Epaper

America: ట్రంప్ చేతుల్లోకి వెనెజులా.. భారత్‌కు కలిసొచ్చేనా?

Aanusha
America: ట్రంప్ చేతుల్లోకి వెనెజులా.. భారత్‌కు కలిసొచ్చేనా?

అమెరికా (America) దళాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ దేశ చమురు రంగం కూడా అమెరికా కంట్రోల్‌లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ప్రకటించారు. దీంతో భారత చమురు రంగానికి ఎలాంటి ప్రభావం ఉంటుందో అనేదానిపై చాలామందికి సందేహం నెలకొంది.

Read also: Bangladesh: బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం?

అయితే ఈ పరిణామాల వల్ల మనదేశ చమురు కంపెనీలకు లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే భారీమొత్తంలో బకాయిలు వసూలవుతాయని అంచనా వేస్తున్నారు. వెనెజువెలా (Venezuela’s Oil Reserves) చమురు రంగాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటే మన భారత్‌కు రావాల్సిన 1 బిలియన్‌ డాలర్ల (రూ.9 వేల కోట్లు) బకాయిలు అందే ఛాన్స్ ఉంటుంది.అక్కడ మన కంపెనీలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి ముడిచమురు ఉత్పత్తిని పెంచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

America: Will Venezuela falling into Trump's hands be advantageous for India?
America: Will Venezuela falling into Trump’s hands be advantageous for India?

భారత్‌ వాణిజ్యంపై అంతగా ఉండదు

గతంలో భారత్‌కు వెనెజులా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉండేది. రోజుకు ఏకంగా 4 లక్షల బ్యారెళ్లకు పైగా చమురును అక్కడి నుంచి దిగుమతి చేసుకునేది. 2020లో వెనెజువెలాపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత్‌ అక్కడి నుంచి చమురు కొనుగోళ్లను ఆపేసింది.అమెరికా-వెనెజులా మధ్య పరిణామాల ప్రభావం భారత్‌ వాణిజ్యంపై అంతగా ఉండదని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ వెల్లడించింది.

ఆంక్షల తర్వాత వెనెజులాతో భారత వాణిజ్యం భారీగా తగ్గిపోయింది. 2024-25లో ముడిచమురు దిగుమతులు 81.3 శాతానికి పడిపోయాయి. ఇదే సమయంలో వెనెజులా నుంచి దిగుమతులు 364.5 మిలియన్ డాలర్లు (రూ.3280 కోట్లు) మాత్రమే. ఈ సమయంలోనే మన ఎగుమతులు 95.3 మిలియన్ డాలర్లు (రూ.850 కోట్లు)గా ఉంది. అయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అంతగా ఉండదని నిపుణలు చెబుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

📢 For Advertisement Booking: 98481 12870