(America) అమెరికన్ ఉద్యోగాలను రక్షించాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ట్రంప్ (Trump) ప్రభుత్వం ఈ వీసా కార్యక్రమంలో జరుగుతున్న దుర్వినియోగాలపై (Visa Abuse) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 175 కేసులపై దర్యాప్తు (Investigation) ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Read Also: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్
ట్రంప్ పరిపాలన హెచ్-1బీ వీసా (H-1B visa) దరఖాస్తులపై లక్ష డాలర్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.88 లక్షలు) వన్ టైమ్ ఫీజును విధించిన వెంటనే.. కార్మిక శాఖ ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ ద్వారా హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టి.. అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్ డీరెమర్ (Lori Chavez DeRemer) వెల్లడించిన వివరాల ప్రకారం, హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అమెరికా ఉద్యోగాలను రక్షించడానికి కార్మిక శాఖ తమ వద్ద ఉన్న ప్రతి వనరును ఉపయోగిస్తోందని, వెల్లడించారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడానికి.. అనుమానిత ఉల్లంఘనలపై తాను వ్యక్తిగతంగా దర్యాప్తులకు ధృవీకరణ ఇస్తున్నానని తెలిపారు.

ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్ కార్మికులకే
డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో.. నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్ కార్మికులకే దక్కేలా చూస్తామని ఆమె ఎక్స్ వేదికగా ప్రకటించారు.గత నెల సెప్టెంబరు 19వ తేదీన ట్రంప్ పరిపాలన ఈ లక్ష డాలర్ల ఫీజును ప్రకటించింది. అయితే స్టేటస్ మార్పు, బస పొడిగింపు కోరుకునే దరఖాస్తుదారులకు ఈ ఫీజు వర్తించదని అమెరికా (America) పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తర్వాత స్పష్టం చేసింది.
లక్ష ఫీజు నుంచి మినహాయింపులు అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే లభిస్తాయని పేర్కొంది. హెచ్-1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగి ఉనికి అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరం అయినప్పుడు.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఏ అమెరికన్ కార్మికుడు అందుబాటులో లేనప్పుడు.. ఆ ఉద్యోగి అమెరికా భద్రతకు లేదా సంక్షేమానికి ముప్పు కలిగించని వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: