రెండోసారి అమెరికా( America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎంపిక అయ్యాక ప్రపంచదేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యేకంగా విదేశీయులపై, అక్రమ వలసలపై తన ఉక్కుపాదాన్ని మోపారు. వీసాలపై కఠిన నిబంధన, నియమాలతో ఘననీయంగా విదేశీ విద్యార్థులను, ఉద్యోగులను అమెరికాకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక అధిక సుంకాలతో ప్రపంచ ట్రేడ్ వార్కు పూనుకున్నారు. ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా రోజుకో కొత్త నిబంధనలపై సంతకాలు చేస్తున్నారు. సొంత దేశస్తులే ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలనపై సవాలు చేస్తూ కోర్టుల ద్వారా న్యాయస్థానాల్లో పలు సంస్థలు పోరాడుతున్నాయి. తాజాగా ట్రంప్ 2028లో మరో సారి అధ్యక్షుడిపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Read Also: Jharkhand Chhath: విషాదంగా మారిన పండుగ ఆనందం..ముగ్గురు చిన్నారులు మృతి

మంగళవారం మీడియా సమావేశంలో ట్రంప్ చెప్పిన మాటలు పలు ఊహాగానాలకు తావునిచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి అయితే కచ్చితంగా పోటీచేయనని చెబుతూనే మూడోసారి అధ్యక్ష పదవిని కొనసాగించడంపై మాత్రం మాట దాటవేశారు. అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేసే అవకాశం గురించి అడిగినప్పుడు తాను అలా చేయాలనే అనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. తాను గెలవడానికి చాలా అవకాశాలున్నాయని దానికి సంబంధించిన డేటా కూడా తన దగ్గర ఉందని ట్రంప్పేర్కొన్నారు. కాబట్టి మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని తాను తోసిపుచ్చలేనని చెప్పారు.
జేడీవాన్స్, మార్కు రూబియోలు సిద్ధం
2028 ఎన్నికలకు పోటీదారులుగా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, విదేశాంగ(America) కార్యదర్శి మార్కు రూబియోలు సిద్ధంగా ఉన్నారని..వారిని దాటుకుని వెళ్లడం కష్ట మని ట్రంప్ తెలిపారు. దీనిపై రిపబ్లికన్ పార్టీలో ఎప్పుడైనా సమావేశం జరిగితే వారికే ఎక్కువ ఓట్లు వస్తాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు మూడుసార్లు పోటీ చేయలేదు. అమెరికా రాజ్యాంగపరంగా కూడా అలా చేయడం విరుద్ధం కూడా.
గతంలోనూ దీనిపై మాట్లాడిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ మూడోసారి పోటీ గురించి మాట్లాడం ఇదేమీ మొదటిసారికాదు. గతంలో ఒకటి రెండుసార్లు దీనిపై ట్రంప్ వ్యాఖ్యానిచ్చారు. తన పదవీ విరమణ తర్వాత కూడా వైట్ హౌస్ ను విడిచి పెట్టరనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ట్రంప్ తన కఠిన నిర్ణయాలపై సొంతదేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. లాస్ ఏంజెల్స్ లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ, పలు ప్రదర్శనలు కూడా జరిగాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: