हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

America: రష్యాతో ఆయిల్ డీల్ ఆపాలని భారత్ కు ట్రంప్ వార్నింగ్

Saritha
America: రష్యాతో ఆయిల్ డీల్ ఆపాలని భారత్ కు ట్రంప్ వార్నింగ్

లేకపోతే సుంకాలు పెంచుతాం..

(America) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి భారత్ కు గట్టి హెచ్చరిక చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో న్యూఢిల్లీ సహకరించకపోతే.. భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కథనాన్ని రాయిటర్స్ వార్తాసంస్థ సోమవారం ప్రచురించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాలను పెంచే అంశంపై కూడా అమెరికా వెనుకాడని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ సర్కారు గత సంవత్సరం భారత వస్తువులపై సుంకాలను 50శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోందన్న కారణాన్ని చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. రష్యా చమురు సమస్యపై భారత్ సహాయం చేయకపోతే మేం టారిఫ్ లను ఇంకా పెంచవచ్చని హెచ్చరించారు.

Read also: Monkeys: చైనాలో కోతులకు పెరుగుతున్న డిమాండ్‌.. కారణాలేంటి?

America: రష్యాతో ఆయిల్ డీల్ ఆపాలని భారత్ కు ట్రంప్ వార్నింగ్
America Trump warns India to stop the oil deal with Russia.

రెండుదేశాల మధ్య వాణిజ్య చర్చలు

అయితే, భారతదేశం ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. (America) వాళ్లు నన్ను సంతోషపెట్టాలని కోరుకున్నారు. ప్రధాని మోడీ చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం వారికి ముఖ్యం. వారు వ్యాపారం చేస్తారు, కానీ మేం కావాలంటే చాలావేగంగా సుంకాలను పెంచగలమని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల సమయంలో జరగడం గమనార్హం. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకారం, న్యూఢిల్లీ, వాషింగ్టన్ ప్రతినిధులు ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆశిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఆరత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో మెరుగైన అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:




గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870