గతవారం రోజులుగా ఇరాన్ లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో దాదాపు 16మంది ఆందోళనాకరులు మరణించారు. ఇరాన్ లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్ లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతాదళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16మంది ఆందోళనకారులు మృతి చెందారు. (America) దీనిపై ట్రంప్ (Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమేనీకి ట్రంప్ తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నిరసనకారులు చనిపోతే కఠిన చర్యలు ఉంటాయని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో సోమవారం ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: Donald Trump: లాటిన్ దేశాలకు ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన ఉద్రిక్తతలు

అమెరికా జోక్యంపై ఇరాన్ స్పందన
అమెరికా, ఇజ్రాయెల్ వార్నింగ్ లపై ఖమేనీ సీనియర్ సలహాదారు అలీ లారిజాని సోషల్ మీడియాలో స్పందించారు. (America) ‘ఇజ్రాయెల్, ట్రంప్ ప్రకటనలు వెనుక ఏం జరుగుతుందో స్పష్టం చేస్తునానయి. నిజమైన నిరసనకారులు-విధ్వంసక శక్తుల మధ్య మేం స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించాం. ఈ దేశం విషయంలో అమెరికా జోక్యం ఈ ప్రాంతం మొత్తాన్ని అస్థిరపరుస్తుంది. అంతేకాకుండా అమెరికా ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. వారు తమ సైనికుల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాలి అని పేర్కొన్నారు. నిరసనకారులను చంపుకుంటూ పోతేమానరతం ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. తమ దేశ పరిస్థితులపై ట్రంప్ జోక్యం చేసుకుని, హెచ్చరించడం అది మాదేశాన్ని అస్థిరతకు దారితీస్తుందని ఓ ప్రకటనలో ఇరాన్ పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: