అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాల (H-1B Visa) వినియోగంపై మరోసారి తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రశ్రేణి టెక్ కంపెనీలు (Tech companies) స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, అదే సమయంలో వేల సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకోవడంపై సీనియర్ సెనేటర్ రూబెన్ గాలెగో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఆయన ట్రంప్ (Trump) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామం హెచ్-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారతీయ టెక్ నిపుణులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
Read Also: UK: ప్రో-ఖలిస్థాన్ గ్రూప్ బబ్బర్ ఖల్సా పై బ్రిటన్ ఆంక్షలు

గాలెగో కార్మిక శాఖ కార్యదర్శి, యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ మరియు అటార్నీ జనరల్‌కు రాసిన లేఖలో పలు కీలక అంశాలను లేవనెత్తారు. “అమెరికా (America) ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నైపుణ్యం కలిగిన వలసదారులు అవసరమే. కానీ, ఆ కార్యక్రమాలు అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికి లేదా వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక మార్గంగా మారకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు లక్షలాది మంది స్థానిక ఉద్యోగులను తొలగించాయని, అదే సమయంలో 2025 ఆర్థిక సంవత్సరంలో 30,000 మందికి పైగా విదేశీ నిపుణులకు హెచ్-1బీ వీసాలు పొందాయని ఆయన ఆరోపించారు.
యువ అమెరికన్ ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల
సెనేటర్ గాలెగో గణాంకాలతో సహా ఈ ఆరోపణలను వివరించారు. ఈ కంపెనీలలో యువ అమెరికన్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. 2023 జనవరిలో 21-25 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగుల వాటా 15 శాతం ఉండగా, 2025 జూలై నాటికి అది కేవలం 6.7 శాతానికి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ఒకవైపు అమెరికన్ యువతకు ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే, కంపెనీలు విదేశీ నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ అమలు తీరుపై కూడా ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
భారతీయ ఐటీ పరిశ్రమపై పడే ప్రభావం
ఈ పరిణామాలను భారత ఐటీ పరిశ్రమ నిశితంగా గమనిస్తోంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే అత్యధికం. ఒకవేళ అక్కడి ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను మరింత కఠినతరం చేస్తే, అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఇంజనీర్లు, ఐటీ నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: