అమెరికా(America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్–పాకిస్తాన్ మధ్య అణు ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన సమయంలో తాను జోక్యం చేసుకోవడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన యుఎస్–సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో మాట్లాడిన ట్రంప్, ఆ సంక్షోభాన్ని తానే ఆపేశానని పేర్కొన్నారు.
Read Also: Children’s Rights : బాలల హక్కుల పరిరక్షణ కాగితాలకే పరిమితం!
భారత్–పాకిస్తాన్(Indo-Pak) సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న రోజుల్లో, రెండు దేశాలు అణ్వాయుధాల వినియోగం వరకు ఆలోచిస్తున్నాయని, ఆ సమయంలో తాను అందులోకి ప్రవేశించాల్సి వచ్చిందని ట్రంప్ తెలిపారు. “మీరు ఇలా ముందుకు వెళితే ప్రతి దేశంపై 350 శాతం సుంకాలు విధిస్తాను. అమెరికాతో వాణిజ్యం పూర్తిగా నిలిపేస్తాను” అని ఇద్దరికీ కఠిన హెచ్చరిక ఇచ్చానని పేర్కొన్నారు. తన ఆ దృఢమైన ధోరణి తర్వాతే ఉద్రిక్తతలు తగ్గాయని వ్యాఖ్యానించారు.

యుద్ధం జరిగితే లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో
అణు యుద్ధం జరిగితే లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాకుండా, దాని ప్రభావం అమెరికాపైనా ఉంటుందని ట్రంప్ చెప్పారు. ట్రెజరీ శాఖ అధికారులను కూడా చర్యలకు సిద్ధం చేయమని ఆదేశించానని పేర్కొన్నారు. ఆర్థిక ఒత్తిడి, వాణిజ్య ఒత్తిడిని దౌత్య ఆయుధాల్లా వాడటం తాను మొదటినుంచే చేపట్టిన పద్ధతేనని అన్నారు. తన జోక్యం తర్వాత ముందుగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారని, అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గాయని తెలిపారని అభిప్రాయపడ్డారు. తాను రెండు దేశాలకు కొత్త ఒప్పందం కుదుర్చుకుందామని సూచించానని కూడా పేర్కొన్నారు.
ట్రంప్ ఇదే కథనాన్ని గతంలో అనేకసార్లు సోషల్ మీడియాలో
అయితే ట్రంప్ ఇదే కథనాన్ని గతంలో అనేకసార్లు సోషల్ మీడియాలో మరియు సభల్లో చెప్పిన విషయం తెలిసిందే. భారత్ మాత్రం ఆయన వాదనలను ఖండిస్తూ వస్తోంది. 2021లో భారత్–పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే సాధ్యమైందని, మూడవ దేశానికి అందులో ఎలాంటి పాత్ర లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది.
ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. సున్నితమైన అణు భద్రత అంశాలపై ఇలాంటి అతిశయోక్తి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైనదన్న ప్రశ్న కూడా నిపుణుల్లో చర్చనీయాంశమైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: