ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు వెనిజులా, అమెరికా వైపు చూస్తున్నది. (America) అమెరికా అదుపులో వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను బంధీలుగా అమెరికాకు తరలించి, రాజకీయ పెనుసంచలనాకి నాందీ పలికింది అమెరిక. మదురోను పట్టుకోవడానికి వాస్తవంగా అమెరికా గత సెప్టెంబరు 2025 న ఆపరేషన్ సదరన్ స్పియర్ ను ప్రారంభించింది. డిఫెన్ వన్ మ్యాగజైన్ ప్రకారం.. ఈ ఆపరేరషన్ లో ఒక యుద్ధనౌక, ఒక అణు జలాంతర్గామి, జెరాల్డ్ ఫోర్డ్ మోహరించడానికి ప్లాన్ చేశారు. వెనిజులా దిగ్బంధించడానికి అమెరికా మోహరించిన అన్ని ఆయుధాల ఖర్చు గంటకు రూ. 3కోట్లు అని ఆ పత్రిక తెలిపింది. మొత్తం ఆపరేషన్ సెప్టెంబరు నుంచి జనవరి వరకు జరిగింది. దాదాపు 3,700 గంటలు పట్టింది. మొత్తం ఆపరేషన్ ఖర్చు 11,100 కోట్లు.
Read Also: America: సుంకాలు తగ్గించాలని భారత్ కోరింది: అమెరికా సెనెటర్

మదురో పై బహుమతి ప్రకటన
వెనిజులా అధ్యక్షుడు మదురోపై అమెరికా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.450కోట్లు) బహుమతిని ప్రకటించింది. (America) ఆపరేషన్ జరిగిన వెంటనే ఈ బహుమతిని అధికారులకు పంపిణీ చేశారు. హెలికాప్టర్ ను ల్యాండ్చేసిన పైలట్ కు సుమారు 2మిలియన్ల డాలర్లు ఇచ్చారు. ఈ డబ్బును కూడా అమెరికా నిధుల నుంచే పంపిణీచేశారు. మదురోను పట్టుకునేందుకు అమెరికా మొత్తం 150 హెలికాప్టర్లను పంపింది. రాజధాని కారకాస్ చుట్టూ పదివేల మంది సైనికులను మోహరించారు. ఆగస్టు 2025 నుంచి అమెరికా దళాలు దాడికి ప్రణాళికలు వేస్తున్నాయి. అయితే గతంలో 2020లో వెనిజులాపై అమెరికా ఆపరేషన్ ప్రయత్నించింది. కానీ అది విఫలమైంది. ఈసారి కచ్చితంగా అమెరికా తన ఆపరేషన్ లో ఎటువంటి లోపం రాకుండా జాగ్రత్త పడింది. మదురోను మాదకద్రవ్యాల నాయకుడిగా చిత్రీకరించడానికి పాశ్చాత్య మీడియాను ఉపయోగింది. ట్రంప్ (Trump) ఈ ఆపరేషన్ బాధ్యతను మార్కో రూబియోకు అప్పగించారు. సక్సెస్ గా అతడిని అరెస్టు చేశారు. అయితే మదురో భార్యను అరెస్టు చేయడంపై ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: