అమెరికాలోని (America) బర్మింగ్‌హామ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోరమైన అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తు తెలంగాణ విద్యార్థిని ఉడుముల సహజారెడ్డి (24) మృతి చెందారు. ఉన్నత విద్య (MS) అభ్యసించడం కోసం నాలుగేళ్ల క్రితం (2021లో) ఆమె అమెరికా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి బర్మింగ్‌హామ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె మరణించినట్లు తెలిసింది.
Read Also: USA: అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్
సహజారెడ్డి (Sahaja Reddy) స్వస్థలం మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం, వెంకటాపూర్ గ్రామం. ఆమె తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం అందించారు. చదువు పూర్తి కావొచ్చిన సమయంలోనే ఈ అగ్నిప్రమాదం ఆమెను బలితీసుకోవడంతో, ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రతిరోజూ తమ కుమార్తెతో వీడియో కాల్‌లో మాట్లాడేవారు, ఈ ఏడాది ఆమె ఇండియాకు వస్తుందని ఎదురుచూశారు. చివరికి తమ కుమార్తె మృతిచెందిందన్న వార్త విని గుండెలవిసేలా రోదించారు.

తల్లిదండ్రుల వివరాలు మరియు నివాసం
సహజారెడ్డి తండ్రి, ఉడుముల జయాకర్ రెడ్డి, హైదరాబాద్‌లోని టీసీఎస్ (TCS) లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లి శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీ టీచర్‌గా పనిచేసి, ఇటీవల డిప్యుటేషన్‌పై హైదరాబాద్ (Hyderabad) ఎస్‌సీఆర్‌టీకి వెళ్లారు. కొన్నేళ్లుగా సహజారెడ్డి కుటుంబం హైదరాబాద్‌లోని జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో స్థిరపడింది.
జయాకర్ రెడ్డి, శైలజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోనే బీబీఎస్ కోచింగ్ తీసుకుంటోంది.
అపార్ట్‌మెంట్‌లోని పరిస్థితి
సహాజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. అర్థరాత్రి కావడంతో ఆమె నిద్రిస్తున్న సమయంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగినప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: