हिन्दी | Epaper
కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

America: సుంకాలు తగ్గించాలని భారత్ కోరింది: అమెరికా సెనెటర్

Pooja
America: సుంకాలు తగ్గించాలని భారత్ కోరింది: అమెరికా సెనెటర్

అగ్రరాజ్యం అమెరికా(America), భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరోసారి ఉత్కంఠకు దారితీస్తున్నాయి. దిగుమతి సుంకాలు తగ్గించాలని భారత్ తమను కోరిందంటూ అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో జరిగిన అత్యంత రహస్య సంభాషణను ఆయన మీడియా ముందు బహిర్గతం చేయడం దౌత్యవర్గాల్లో కలకలం రేపుతోంది.

Read Also: China: ట్రంప్ ఏకపక్ష బెదిరింపులపై జిన్ పింగ్ విమర్శలు

America
America

రాయబారితో చర్చల గుట్టురట్టు

దాదాపు నెలరోజుల క్రితం భారత రాయబారి క్వాత్రా నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన చర్చల గురించి గ్రాహమ్ వివరించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించుకుందని క్వాత్రా తనకు తెలిపినట్లు సెనెటర్ పేర్కొన్నారు. ‘మేం రష్యా ఆయిల్ కొనుగోలును తగ్గించాం.. కాబట్టి ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ కు చెప్పి, మాపై ఉన్న 25శాతం సుంకాన్ని తగ్గించేలా చూడండి’ అని భారత రాయబారి విజ్ఞప్తి చేసినట్లు గ్రాహమ్ వెల్లడించారు. లిండ్జీ గ్రాహమ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పక్కనే ఉండటం గమనార్హం.

మరోవైపు భారత్ పై సుంకాల అస్త్రాన్ని ప్రయోగించేందుకు ట్రంప్(America) సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. కానీ నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు బాగా తెలుసు. నన్ను సంతోషపెట్టడం భారత్ కు చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను చాలావేగంగా పెంచుతాం అని ట్రంప్ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870